
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ గరిష్ట స్థాయి నుంచి ఇంకా తక్కువ ధరకే పలుకుతున్నాయి. నేడు జూన్ 14వ తేదీ ఆదివారం బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,535 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,325 రూపాయలు పలుకుతుంది. అదే ఒక కిలో వెండి ధర 2, 46,457 రూపాయలు పలుకుతుంది. ఈ ఏడాది జనవరిలో నమోదైన ధరల ప్రకారం చూసినట్లయితే... ప్రస్తుతం కొనసాగుతున్న ధరలు రికార్డు గరిష్ట స్థాయి నుంచి దాదాపు తులంపై 16వేల రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు మనం గమనించవచ్చు. వెండి కూడా రికార్డు స్థాయి నుంచి దాదాపు 1.50లక్షల తక్కువగా పలుకుతోంది. అయితే బంగారం ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గుతూనే వస్తున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాల వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెప్పాలి. ప్రధానంగా అమెరికా వడ్డీ రేట్లు పెంచుతుంది అన్న అంచనాలు బంగారం ధర తగ్గడానికి దోహదమవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ 4225 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన రెండు వారాల్లో బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 2.5% వరకు తగ్గినట్లు మనం గమనించవచ్చు . ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం వార్తలు వస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ముడిచమురు సరఫరా విషయంలో అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయితే అదే సమయంలో ద్రవ్యోల్బణం వెంటనే తగ్గే ఛాన్స్ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కొంతకాలం
కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ శాంతి ఒప్పంద దిశలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చమురు సరఫరా విషయంలో నెమ్మదిగా అడ్డంకులు తొలగిపోయి క్రూడ్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
తాజాగా క్రూడాయిల్ ధర రెండు శాతం వరకు తగ్గినట్లు మనం గమనించవచ్చు. అయితే ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది అన్న వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఇరాన్ కు చెందిన వార్స్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ మాత్రం ఇది పూర్తి అవాస్తమంటూ ఖండించింది. మరోవైపు జూన్ 16, 17 వ తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనుంది. దీనిపై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ వడ్డీరేట్లు స్థిరంగా ఉంచే ఛాన్స్ ఎక్కువగా ఉందని అటు మార్కెట్ అంచనాలు కూడా వెలువడుతున్నాయి. కానీ మెజార్టీ వర్గాలు మాత్రమే వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా తాజాగా విడుదల చేసిన ఆర్థిక గణాంకాల ప్రకారం మే నెలకి సంబంధించి ఉత్పత్తి ధరల సూచీ అంచనాలకు మించి భారీగా పెరిగిందని చెప్పాలి. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా దాదాపు నాలుగు శాతం వరకు పెరిగినట్లు మనం గమనించవచ్చు. మరోవైపు ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన UBS బ్యాంకు బంగారంపై తన అవుట్ లుక్ మార్చుకుంది. భవిష్యత్తులో బంగారం ధరలు ఒక ఔన్స్ 3850 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేసింది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.