
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Hanamakonda SI Assaults Woman: నాకు కొడుకు లేడు, నా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హనుమకొండ ఎస్ఐ గోదారి రాజకుమార్ నమ్మించి, ఒక మహిళను లొంగదీసుకున్నాడు. దీనివల్ల ఆమె గర్భవతి కూడా అయ్యింది. అయితే బలవంతంగా ఆమెకు అబార్షన్ మాత్రలు వేయించాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకున్నాక పెళ్లి చేసుకోమని సదరు చేయడంతోనే అసలు నిజం బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. గతంలో హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గోదారి రాజకుమార్ పనిచేస్తున్న సమయంలో 2022లో ఒక మహిళ తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమెను అదనపు అవకాశంగా భావించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు. తనకు తెలిసిన న్యాయవాది సహాయంతో ఆమె భర్తకు విడాకులు ఇప్పించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మి ఆమెను రెండుసార్లు గర్భవతిని చేశాడు. ఇటీవల బలవంతంగా అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. మళ్లీ పెళ్లి చేసుకోమని అడగగా, ఫోటోలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాదు.. ఎస్ఐ రాజకుమార్ ఆ మహిళను తీవ్రంగా వేధించినట్లు సదరు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకోమని చెబితే న్యూడ్ ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. అంతేకాదు, ఆమె చేసే పనిచోట ఫోన్ నంబర్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి, ఆమెను బలవంతంగా హోటల్స్‌కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను వదిలేయమని అడిగినా, తనతోనే ఉండాలని, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె ఇబ్బంది సరిపోలేదన్నట్లు, అదే పోలీస్ శాఖలో ఉన్న ఆమె తమ్ముడు రవికుమార్ అంతు
కూడా చూస్తానని ఎస్ బెదిరించాడు. చివరికి వేధింపులు తాళలేక న్యాయం కోసంరెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఐజీ ఆఫీసులో ఆమె ఫిర్యాదు చేయడంతో, హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఆయన అవినీతి కేసులో సస్పెండ్ అయ్యారని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఉంటే బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడాల్సిందే. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.