మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ‘ఓజీ టూర్ ఇండియా’ పేరుతో ఓ కాన్సర్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో ఈ లైవ్ కాన్సర్ట్ చేయనున్నట్లు తెలిపారు. అయితే భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఈవెంట్ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా క్యాన్సిల్ అయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో థమన్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“ఈ ‘ఓజీ టూర్ ఇండియా’ కోసం పని చేసిన నాకు, నా 56మంది టీమ్ సంతులకు ఇది ఎంతో హృదయ విదారకమైన వార్త. గత 45 రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ, వచ్చిన స్పందనలన్నింటినీ సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటూ వచ్చాం. మేమంతా ఒక బృందంగా, ఈ కాన్సర్ట్‌ను విజయవంతం చేయడానికి ఈ ప్రపంచంలోని పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసుకున్నాము. కొన్నిసార్లు ఒక విషయం అర్థం చేసుకోవాలి, దేవుడికి మనకంటే గొప్ప ప్రణాళికలు ఉంటాయి. నేను ఎల్లప్పుడూ ఆయన్ను, విధిని నమ్ముతాను”“ఇప్పుడు నాకు కావలసిందల్లా మీ ప్రేమ, నమ్మకం మాత్రమే!! మీరందరూ నమ్మేలా చేయడానికి.. ఈసారి మరింత జోష్ తో, ఏమాత్రం తక్కువ కాకుండా OG కాన్సర్ట్ నిర్వహిస్తాం. లవ్ యూ గైస్. నా కంబ్యాక్ ఎప్పుడూ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది” అని థమన్ పోస్టులో పేర్కొన్నారు. దీనికి హార్ట్ బ్రేక్ ఎమోజీని జోడించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వర్షాకాలంలో వానలు పడతాయని తెలియదా?, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.‘ఓజీ టూర్ ఇండియా’ కాన్సర్ట్ జూన్ 13న హైదరాబాద్‌లో, జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్‌లో నిర్వహించనున్నట్లు థమన్ ఇటీవల తెలిపారు. సినిమా ఈవెంట్స్ లో అందరినీ కలుస్తూనే ఉంటాను కానీ, ఇలా తొలిసారి వ్యక్తిగతంగా ‘ఓజీ టూర్ ద్వారా
కలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. తన కోసం ఎప్పుడూ ఈవెంట్లు చేయలేదని, కాన్సర్ట్ల వల్ల వచ్చే మొత్తాన్నీ ఛారిటీలకే ఇస్తుంటానన్నారు. అయితే హైదరాబాద్ లో ప్లాన్ చేసిన OG టూర్ లైవ్ కాన్సర్ట్ వర్షం కారణంగా రద్దయింది. శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వేదిక వద్ద నీరు నిలిచిపోయిందని నిర్వాహకులు వెల్లడించారు. ఈవెంట్‌కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని చెప్పారు. ఈ ఈవెంట్ నిర్వహణ కోసం కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.ఇకపోతే థమన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని ‘NBK111’.. చిరంజీవి - బాబీల 'మెగా 158', అఖిల్ ‘లెనిన్’, ‘ఇట్లు అర్జున’, వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వంటి చిత్రాలకు ఆయన సంగీతం సమకూరుస్తున్నారు. ఇక తమిళంలో ఆయన నటించిన ‘ఇదయమ్ మురళి’ అనే సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.