
ఈ చిత్రంలో కనిపిస్తున్నది విద్యుత్తుతో నడిచే పొయ్యి. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడం, వాటి ధర కూడా పెరగడంతో చిరువ్యాపారులపై ఆ ప్రభావం పడింది. గుంటూరు రెడ్డిపాలెం కూడలిలో చికెన్ పకోడీ దుకాణం నిర్వహిస్తున్న రవి.. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించారు. విద్యుత్తు పొయ్యి కోసం విజయవాడలో ఆరా తీయగా.. రూ.40 వేలతో దీన్ని తయారు చేసి ఇచ్చారు. ప్రస్తుతం దీంతోనే దుకాణం నడుపుతున్నానని, దీనికి నెలకు రూ.15 వేలే విద్యుత్తు బిల్లు వస్తోందని, ఇంతకు ముందు గ్యాస్ సిలిండర్ల కోసం నెలకు రూ.60 వేల దాకా వెచ్చించాల్సి వచ్చేదని వివరించారు. ఈ పొయ్యి కొన్నాక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రెండు సార్లు పెరిగినా తనకు ఇబ్బంది కలగలేదని చెప్పారు. నగరంలో చాలామంది హోటల్ వ్యాపారులు గ్యాస్ బండకు ప్రత్యామ్నాయంగా ఇటువైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.