
ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. అమరావతి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ మేరకు ఆన్లైన్లో ఎంపిక ఫలితాలను ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 44,104 దరఖాస్తులు అందగా, వాటిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేశారు.
ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉండటం విశేషం. గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తూ ప్రవేశాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఎంపిక లేఖలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
అలాగే విద్యార్థుల సహాయం కోసం వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్ - 9552300009ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యా రంగంలో సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని, గ్రామీణ విద్యార్థుల సాధికారతకు ఈ ప్రవేశాలు దోహదపడతాయని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపింది.
ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు డీఎస్సీపై అపోహలు వద్దు.. అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్: ఏపీ విద్యాశాఖ
Read Latest AP News And Telangana News And National News