
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chandrababu Singapore Tour: అభివృద్ధికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా మరోసారి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. రేపు సింగపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెట్టుబడులే లక్ష్యం రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఏపీ బృందం సింగపూర్‌లో పర్యటించనుంది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం బృందం సింగపూర్‌లో పర్యటించనుంది. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు సీఎం హాజరు కానున్నారు. 16 తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. ప్రముఖులతో భేటీ అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాబ్‌తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తో సమావేశం కానున్నారు. గూగుల్ క్లౌడ్ ఏపీఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్‌తో చర్చలు జరగనున్నాయి. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్
రాబర్ట్ యాప్‌తోనూ, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్‌తో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తోనూ పలు అంశాలపై చర్చిస్తారు.
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ ఏపీ ప్రభుత్వ బృందం భేటీ కానుంది. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోం మంత్రి కె షణ్ముగమ్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్తో భేటీ జరుగుతుంది. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్ 361ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం జరగనున్న ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
ఏపీ ప్రభుత్వ బృందం ఇదే సుర్బానా జురాంగ్-అమరావతి ప్లానింగ్ సమావేశానికి ఏపీ ప్రభుత్వ బృందం హాజరు కానుంది. సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశం అవుతారు. తర్వాత ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శించి.. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలయ్, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ వివరాలు ఏపీ బృందం తెలుసుకోనుంది.
సీట్రియమ్ సమావేశంలోనూ పాల్గొన్న సీఎం చంద్రబాబు పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం ఉంది.