
మధ్యప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో గోండ్ ఆదివాసీ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెగలో మహిళలు ఎప్పటికీ విధవలుగా మారరు. ఈ తెగలో భర్త చనిపోయినా మహిళలు ముత్తైదువులుగానే ఉంటారు. భర్త చిన్న వయసులో చనిపోయినా, లేదా వృద్ధాప్యంలో మరణించినా.. వీరు మాత్రం విధవలుగా మారరు. ఈ తెగలో ఎవరైనా మహిళ భర్త చనిపోతే, 10వ రోజు ఆమెకు మరో పెళ్లి చేస్తారు. అంటే భర్త చనిపోయాడన్న బాధను దిగమింగుకుని, మరో పెళ్లికి సిద్ధమవ్వాల్సిందే. ఆ మహిళ రెండో పెళ్లిని ఇంట్లో ఉన్న మరో మగవారితో జరిపిస్తారు. వరుడు.. ఆమె బావ, మరిది లేదా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా కావచ్చు. ఒకవేళ ఆ ఇంట్లో ఏ మగాడూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే, 10వ రోజు ఆమెకు వెండి గాజు తొడిగిస్తారు. ఆ తర్వాత నుంచి ఆమెను ముత్తైదువుగానే పరిగణిస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో భర్త చనిపోతే మహిళలకు విధవ అనే ముద్ర వేసి దారుణంగా చూస్తారు. వారికి మరో పెళ్లి ఉండదు, అలంకరణ చేసుకోకూడదు… ఇలాంటి ఎన్నో ఆంక్షలు విధిస్తారు. కానీ గోండ్ తెగలో మాత్రం మహిళలకు గౌరవం ఇస్తారు. మహిళల సామాజిక భద్రత బాధ్యతను పురుషులు తమ కర్తవ్యంగా భావిస్తారు. Women Army : ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా? బ్యాచిలర్స్ Vs పెళ్లైన మగాళ్లు.. వీరిలో ఎక్కువకాలం బ్రతికేది ఎవరు? షుగర్ ఉత్పత్తి, వాడకంలో వరల్డ్ నెంబర్ 1 ఎవరో తెలుసా..? Snakes : పాములు నిజంగానే నిధుల్ని కాపాడతాయా?