ఉన్నత విద్యార్హతలతో పాటు భారీ వార్షిక వేతనం పొందుతున్న ఓ యువకుడు, తన జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో విధించిన కఠినమైన నిబంధనలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారతదేశంలో వివాహ వ్యవస్థలో ఆర్థిక సమానత్వం, లింగపరమైన బాధ్యతలపై ఈ ఉదంతం సరికొత్త చర్చకు తెరలేపింది.ఐఐటీ బాంబే, ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో అభ్యసించిన 34 ఏళ్ల ఈ యువకుడు, ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలో అసోసియేట్ పార్ట్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏడాదికి రూ.1.6 కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు.
వివాహ ప్రయత్నాల్లో భాగంగా అతను 'షాదీ డాట్ కామ్'లో తన ప్రొఫైల్ను నమోదు చేసుకోగా, అనేక సంబంధాలు వచ్చాయి. అయితే, ఆసక్తి కనబరిచిన మహిళల్లో మెజారిటీ వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.6 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండటమే కాకుండా, వారు వివాహానంతరం సంతానం కలిగినా కూడా తమ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నారు.ఈ ప్రతిపాదనలు తనకు 'బ్యాడ్ డీల్' అని సదరు యువకుడు అభిప్రాయపడ్డాడు.
తనతో సమానంగా సంపాదిస్తూ ఆర్థిక, కుటుంబ బాధ్యతలను సమాంగా పంచుకునే భాగస్వామి అయినా కావాలని లేదా తన సంపాదనపై ఆధారపడుతూ పూర్తిస్థాయి గృహిణిగా ఉండే మహిళ అయినా కావాలని అతను స్పష్టం చేశాడు. ఒకవేళ తన భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తే, తాను ఉద్యోగం మాని ఇంటి వద్దే ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించాడు.
ఈ వివరాలను అతని స్నేహితుడైన కబీర్ మీనన్ అనే సైకాలజిస్ట్ జూన్ 11న 'ఎక్స్'వేదికగా పంచుకోవడంతో ఈ