
సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ గురొచ్చే సినిమాల్లో దృశ్యం (Drishyam) ఎప్పుడూ ముందే ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఒరిజినల్ సినిమా కంటే వెంకటేష్ (Venkatesh), మీనా నటించిన రీమేక్ కే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ గురొచ్చే సినిమాల్లో దృశ్యం (Drishyam) ఎప్పుడూ ముందే ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఒరిజినల్ సినిమా కంటే వెంకటేష్ (Venkatesh),మీనా నటించిన రీమేక్ కే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీగా దృశ్యం నిలిచింది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలు చేసిన వెంకీ దృశ్యం 3 ని దూరం పెట్టారు. అందుకు కారణం జీతూ జోసెఫ్ చెప్పాడు కూడా. మూడో భాగంలోని క్లైమాక్స్ ని తెలుగువారు ఒప్పుకోరు కాబట్టి రీమేక్ చేయలేదు అని అన్నారు. ఇక దీంతో దృశ్యం 3 కేవలం డబ్బింగ్ తోనే మే 21 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్నే అందుకుంది. తెలుగులో ఆశించినంత టాక్ రాకపోయినా కలెక్షన్స్ మాత్రం మంచిగానే ఉన్నాయంటున్నారు. ఇక దృశ్యం 3 ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. నెల కూడా తిరక్కముందే జార్జ్‌కుట్టి కుటుంబం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. తాజాగా అమెజాన్ దృశ్యం 3 అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను పోస్టర్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది. గత రెండు భాగాల డిజిటల్ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా గ్లోబల్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుందట. ఈ చిత్రం జూన్ 18 నుంచి అమెజాన్
లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్కు రాబోతోంది.
దృశ్యం 3 కథ విషయానికొస్తే జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసులతో ఆడిన ఫైనల్ మైండ్ గేమ్ ఏంటి? గతాన్ని తవ్వుకుంటూ వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల వ్యూహాలను ఎలా తిప్పికొట్టాడు? అనే ఉత్కంఠభరితమైన ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే చివరి 20 నిమిషాల వైల్డ్ ట్విస్ట్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేసింది. థియేటర్ లో మిస్ అయినవారు ఓటీటీలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది
షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో