ఇందు వేలిముద్ర కోసం రేఖ ప్రయత్నిస్తుంది. డాక్యుమెంట్లను తీసుకు వచ్చి ఇందుని వేలి ముద్ర వేయమని చెబుతుంది. సరైన టైంలో రాజు ఎంట్రీ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్లను చదువుతాడు. అందులోని మోసాన్ని పసిగడతాడు. నా
భార్యను మోసం చేయాలని చూస్తున్నారా.. సీఈవో మొదటి రోజే దింపేయాలని చూస్తున్నారా.. ఇందులో చాలా మోసం ఉంది.. దీనిపై వేలి ముద్రను వేయనివ్వను అని రాజు అంటాడు. మా రేఖ ఆంటీ అలా చేయదు అని ఇందు రివర్స్‌లో నాటకం ఆడుతుంది. అంటే మీ రేఖ ఆంటీనే నమ్ముతావా? అయితే సరే.. రేపు సీఏని రమ్మని పిలుద్దాం.. ఆ డాక్యుమెంట్లు చూపిద్దాం.. అంతా సరిగ్గా ఉంటే నువ్వు వేలి ముద్ర వెయ్యి అని అంటాడు రాజు. సరే.. మాకేమైనా భయమా? రేఖ ఆంటీ.. రేపు సీఏని పిలుద్దాం.. అని అంటుంది ఇందు. ఏంటీ మీ రేఖ ఆంటీ నోరు విప్పడం లేదు అని రాజు కౌంటర్లు వేస్తాడు. సీఏ ఇక్కడ లేడు.. బయటకు వెళ్లాడు.. అని భూషణ్ అంటాడు. అయితే వచ్చాకే చేద్దాం లే అని ఆ డాక్యుమెంట్లను చించి అవతల పారేస్తాడు రాజు.శేషుకి భ్రమరం వార్నింగ్.. మనం అనుకున్న ప్లాన్ అంతా పాడు చేశావ్ అని శేషు మీద చన్నీళ్లు పోస్తుంటుంది భ్రమరం. ఏం ప్లాన్ అని శేషు అనడంతో భ్రమరంకి ఇంకా కోపం వస్తుంది. ఆ గుర్తుకు వచ్చింది అని శేషు అంటాడు. నీ వల్లే ఇందు వేలి ముద్ర వేయలేదు.. నువ్వు కదా.. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నావ్.. అదే అనకపోయి ఉంటే.. ఈ పాటికి వేలి ముద్ర వేసేది.. నువ్వే చెడగొట్టావ్.. రాజుతో కలిసి మందు కొడతావా? అంటూ భ్రమరం ఆ చన్నీళ్లు పోస్తూనే ఉంటుంది. వద్దు భ్రమరం చచ్చిపోయేలా ఉన్నా.. అని శేషు అంటాడు. ఈ భయం అప్పుడు ఏమైంది అంటూ భ్రమరం రెచ్చిపోతోంది.ఊహల్లో రాజు.. నేను నిజంగానే తాగి ఇదంతా చేశానని అనుకుంటున్నారు.. పిచ్చోళ్లు. నా పేమెంట్‌కి న్యాయం చేశా.. ఇక ఇందుకి నేను చేసిన సాయం నచ్చుతుంది.. వచ్చి నన్ను హగ్ చేసుకుంటుంది.. ఐ లవ్యూ చెబుతుంది.. ముద్దు కూడా పెడతాను అన్నట్టుగా రాజు తనలో తాను ఊహించుకుంటాడు. ఇక ఇందుకి ముద్దు పెడుతున్నట్టుగా రాజు ఊహల్లో తేలిపోతాడు. ఇంతలో ఇందు వచ్చి గట్టిగా రాజు అని అరిచేస్తుంది. దీంతో ఊహల్లోంచి బయటకు వస్తాడు. ఏంటి ఏదో మూతి అటూ ఇటూ తిప్పుతున్నావ్.. ఏ లోకంలో ఉన్నావ్ అని రాజుని ఇందు అడుగుతుంది.నువ్వు నాకు హెల్ప్ చేశావ్.. నేను నీకు హెల్ప్ చేశాను కదా.. నువ్వు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి.. గట్టిగా హత్తుకుని.. థాంక్స్ చెప్పినట్టుగా ఊహించుకున్నాను అని రాజు అంటాడు. అబ్బో నీకు కోరికలు బాగానే ఉన్నాయే అని ఇందు కౌంటర్లు వేస్తుంది. నీకు ఇంత హెల్ప్ చేశాను కదా కనీసం థాంక్స్ కూడా చెప్పవా? అని రాజు అంటాడు. ఏమాటకి ఆ మాట కానీ.. నువ్వు నాకు హెల్ప్ చేశావ్.. థాంక్స్ లే అని ఇందు అంటుంది. ఇప్పుడు థాంక్స్.. నెక్ట్స్ అని రాజు అంటాడు. ఏయ్ అని ఇందు ఫైర్ అవుతుంది.కిందే పడుకో.. ముందు ఎంప్లాయ్స్‌కి శాలరీ ఎలా ఇవ్వాలనే దాని గురించి ఆలోచించు అని ఇందు అంటుంది. ఈ రోజు జరిగిందంతా నెమరు వేసుకుంటూ హాయిగా పడుకుంటా.. నువ్వు సీఈవో.. నువ్వు ఆలోచించుకో.. అని రాజు అంటాడు. మరి కింద ఏమో డైలాగ్స్ చెప్పావ్.. అన్నీ నేను చూసుకుంటాను.. నాకు తోడుగా ఉంటాను అన్నావ్.. ఎంప్లాయిస్‌కి శాలరీ ఇస్తానని అందరి ముందు చెప్పావ్.. అని ఇందు అంటుంది. నువ్వే సీఈవో కదా.. అన్నీ నువ్వే చూసుకో అన్నట్టుగా రాజు అంటాడు. నేను ఈ బెడ్డు మీద పడుకుంటాను అని రాజు అంటాడు. అంత లేదు.. నీ రెగ్యులర్ ప్లేస్ ఇక్కడే.. కిందే పడుకో అని ఇందు అంటుంది.నా బతుకు మారదు.. నాకు ఈ బెడ్డు మీద పడుకోవాలని ఉంది.. నిన్ను డిస్టర్బ్ చేయను.. కాళ్లు ముడుచుకుని పడుకుంటాను అని రాజు అంటాడు. కుదరదు.. కిందే పడుకో అని ఇందు అంటుంది. చీ నా మిడిల్ క్లాస్ బతుకు మారదు.. కనీసం ఊహల్లోనూ ఏం జరగడం లేదు.. రియాల్టీలోనూ ఏం జరగడం లేదు అని అనుకుంటూ రాజు నిద్రపోతుంటాడు. ఏయ్ ఏం అంటున్నావ్ .. పడుకో అని ఇందు అంటుంది. పడుకో.. నిన్ను చూస్తూనే ఉంటాను అని అనుకుంటున్నావా అని రాజు కౌంటర్లు వేస్తాడు. ఇక రాజు అవస్థల్ని చూసి ఇందు ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది.అబద్దం చెప్పిన వెంకీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రెడీ అయినట్టుగా రెడీ అవుతాడు వెంకీ. చివరకు తాను వెళ్లేది డెలీవరి బాయ్‌గా కదా అని వెంకీకి గుర్తుకు వస్తుంది. మళ్లీ ఇలా ఉద్యోగానికి వెళ్తుండటం చూస్తే ఆనందంగా ఉంది రా అని చలపతి అంటాడు. వేరే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను అని వెంకీ అంటాడు. లేదు రా నా పరువు తీయకు.. అందరికీ సాఫ్ట్ వేర్ అని చెప్పా.. అని వెంకీతో చలపతి అంటాడు. దీంతో సరే.. అదే చేస్తాలే అని అక్కడి నుంచి తప్పించుకుని వస్తాడు వెంకీ. మొదటి సారి అబద్దం చెప్పే సరికి ఏదోలా ఉంది.. మ్యానేజ్ చేయడం కష్టమే అని వెంకీ అనుకుంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.