
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ కాగానే ముంబైలో వర్లి ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ మూడేళ్ల కాలానికి Shreyas Iyer : భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్
ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మక వర్లి ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్టుమెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆర్టీసియా రెసిడెన్షియల్ టవర్‌లో ఉన్న ఈ ఫ్లాట్ 360 చదరపు మీటర్లు (3,875 చదరపు అడుగులు ) విస్తీర్ణంలో ఉంది. కాగా.. నాలుగు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. స్క్వేర్ యార్డ్స్ సంస్థ ఐజీఆర్ వెబ్సైట్ ఈ ఒప్పందం వివరాలను వెల్లడించింది. మూడేళ్ల కాలానికి అయ్యర్ లీజు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. 74 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. అలాగే రూ.1.84 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు. *Rohit Sharma : అఫ్గాన్‌తో తొలి వన్డే.. అరుధైన రికార్డు పై రోహిత్ శర్మ కన్ను.. ఇక ఒప్పందం ప్రకారం తొలి ఏడాది నెలకు రూ.18.50 లక్షల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండో ఏడాదిలో దాదాపు 7 శాతం పెరుగుదలతో నెలకు రూ.19.79 లక్షలు, అదే విధంగా మూడో ఏడాదిలో మరో 7 శాతం పెరుగుదలతో కలిపి నెలకు 21.18లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూడేళ్ల కాలానికి అయ్యర్ ఈ ఫ్లాట్‌కు చెల్లించే మొత్తం అద్దె విలువ సుమారు 7.14 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే.. గత రెండున్నర ఏళ్లలో శ్రేయస్ అయ్యర్ తన కెరీర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడలేదనే కారణంగా 2024లో అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు నిలకడగా రాణించడంతో టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే అతడు 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లు, 2025 ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నమెంట్లకు ఎంపిక కాలేకపోయాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ ప్రస్థానం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే..ప్రతికూల పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న అయ్యర్.. తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు. బ్యాటింగ్‌లో ఎంతో నిలకడగా పరుగులు రాబట్టాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈ క్రమంలో అతడు తిరిగి పొట్టి ఫార్మాట్లో భారత జట్టులో చోటు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. కెప్టెన్‌గా అయ్యర్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.