సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా
నిర్వహిస్తున్నారు. GMB ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, వరల్డ్ ఆఫ్ రావు బహదూర్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో సత్యదేవ్ తో పాటుగా చిత్ర బృందం పాల్గొంది.హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ''జ్యోతి లక్ష్మి' సినిమా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది. నన్ను హీరోగా లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ కి నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. ఆయన వల్లే నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు 'రావు బహదూర్' టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాదిలో వచ్చే 51 శుక్రవారాల్లో ఈ సినిమా విడుదలయ్యే శుక్రవారం డిఫరెంట్ గా ఉంటుందని మేము చెబుతూ వస్తున్నాం. ఏదో ఒక ట్యాగ్ పెట్టేసి సినిమాని ప్రమోట్ చేద్దాం అని అలా చెప్పలేదు. నిజంగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్యాగ్ అది'' అని అన్నారు. (‘గుర్తుపెట్టుకోండి.. ఇది కేవలం టీజర్ మాత్రమే’.. ‘రావు బహదూర్’పై మహేష్ బాబు పోస్ట్)''ఏ ఇండస్ట్రీలోనైనా ఒక మంచి, క్రేజీ సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు దాన్ని ఫస్ట్ సపోర్ట్ చేస్తారు. జూలై 3న రాబోతున్న 'రావు బహదూర్' చిత్రాన్ని మిగతా ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా అంతే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందని గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు 'బాహుబలి', RRR సినిమాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, 'రావు బహదూర్' గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకుంటారు. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడేలా ఈ సినిమా చేశాం''''పేరు చూసి ఈ సినిమా చూడాలని అనుకునే డైరెక్టర్ల జాబితాలో వెంకటేష్ మహా తప్పకుండా ఉంటాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, తన ప్రైమ్ టైమ్ అంతా ఈ సినిమా కోసం పెట్టాడు. అనురాగ్, శరత్ అలాగే ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ సినిమాపై అపారమైన ప్యాషన్ ఉంది. మాకు సినిమా అంటే పిచ్చి. అలాంటి టీమ్‌లో భాగమైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. వెంకటేష్ మహా లాంటి దర్శకుడు సినిమాలు చేస్తున్న కాలంలో నేను నటుడిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా షాక్ చేస్తుంది. జూలై 4 నా పుట్టినరోజు. మీరందరూ ఈ సినిమాను చూసి నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను'' అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.