
పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు ఓ భర్త చేసిన వినూత్న ప్రయత్నం నవ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి తన ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన సరదా పని అందరి దృష్టిని
Jun 12 2026 6:31 PM | Updated on Jun 12 2026 6:52 PM
పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు ఓ భర్త చేసిన వినూత్న ప్రయత్నం నవ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి తన ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన సరదా పని అందరి దృష్టిని ఆకర్షించింది. నా భార్యను నాతో తిరిగి పంపండి అంటూ రాసిన కేక్ తీసుకెళ్లి అత్తామామలను బతిమాలుకున్నాడు. ఇంతగా అడిగితే ఎవరైనా కాదంటారా? వెంటనే అత్తమామలు.. అల్లుడికి తన కూతురిని అప్పగించేశారు. ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వెగ వైరల్ అవుతోంది.
‘కరణ్ & మోనా’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. “నువ్వు లేకుండా ఉండలేని వ్యక్తినే పెళ్లి చేసుకో” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు 16 లక్షల లైకులు, 8 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. తన భార్య 10 రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉండటంతో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన భర్త చేతిలో ఒక ప్రత్యేకమైన కేక్ కనిపించింది. ఆ కేక్‌పై ముజే మేరీ బీవీ వాపస్ దొ (నా భార్యను తిరిగి నా దగ్గరకు పంపించండి) అని రాసి ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అత్తగారు స్వయంగా కూతురిని అల్లుడికి అప్పగించడం వీడియోలో కనిపించింది. వీరు ఎక్కడి వారు అనే వివరాలు వెల్లడి కాలేదు. భార్యభర్తల పేర్లు కరణ్, మోనా అని తెలుస్తోంది.
నెటిజన్ల స్పందన పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు వినూత్న పంథా అనుసరించిన సదరు భర్తపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇల్లాలిపై ప్రేమాభిమానాలు చూపించిన ఇంటాయనను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. “వివాహ జీవితాన్ని సంతోషంగా లేదా బాధాకరంగా మార్చేది చాలా వరకు భర్త ప్రవర్తనే. అతని చిన్న చిన్న ప్రయత్నాలు భార్య హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుతాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు.
“ఇది చాలా మధురమైన క్షణం. ముఖ్యంగా అమ్మ గారి స్పందన ఎంతో క్యూట్‌గా ఉంది”, “మీ ఇద్దరికీ ఆశీర్వాదాలు. తన భావాలను ఇంత అందంగా వ్యక్తపరిచే భర్త చాలా అరుదు”, “కూతురిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే ఇలాంటి అల్లుడిని ప్రతి తల్లిదండ్రులు స్వాగతించాలి”, “ఇలాంటి అల్లుడు దొరికినందుకు మీ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది” అని నెటిజనులు కామెంట్లు పెట్టారు.
భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, చిన్న చిన్న మధురమైన ప్రయత్నాలు ఎంతటి ఆనందాన్ని తీసుకురాగలవో ఈ వీడియో మరోసారి గుర్తు చేసిందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.
మూడు ముళ్ల బంధానికి ఆరేళ్లు.. సతీమణికి నవీన్ చంద్ర విషెస్ (ఫోటోలు)
నువ్వు నా భర్తగా రావడం అదృష్టం.. తబిత సుకుమార్ ఎమోషనల్ (ఫోటోలు)
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)
Viral Video: ఫ్లైట్‌లో కోడలితో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్
పోలీస్ స్టేషన్ ముందు జేసీ ఓవర్ యాక్షన్ నడ్డి రోడ్డుపై స్నానం
సుప్రీం కోర్టు మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ..!