
ఇంటర్నెట్ డెస్క్: ఎల్నినో (El Nino)పై భారత వాతావరణ విభాగం (IMD) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ
రుతుపవనాల సీజన్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని.. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనుందని హెచ్చరించింది. దేశంలో రుతుపవనాలపై ఎల్నినో ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే నైరుతి రుతుపవనాల్లో ఈసారి వర్షపాతం తగ్గుతుందని అంచనా వేసింది.
భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కన్నా ఎక్కువగా వేడెక్కడాన్ని ఎల్నినోగా అభివర్ణిస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పోకడలు తారుమారవుతాయి. చివరిగా ఎల్నినో ప్రభావం 2023లో ఏర్పడింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రుతుపవనాల అంతరాయం, వర్షపాతంలో వైవిధ్యం వంటి పరిస్థితులు తలెత్తాయి.
ఎల్నినో ప్రభావానికి అత్యంత ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్న 197 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) తెలిపారు. పంట నష్టభయాలను తగ్గించడానికి రాష్ట్రాల వారీగా అత్యవసర ప్రణాళికలను రూపొందించామన్నారు. వాతావరణ పరిస్థితులు క్షీణిస్తే త్వరితగతిన స్పందించేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం విత్తనాలతో పాటు ఇతర కీలక వ్యవసాయ ఉత్పాదకాలను నిల్వ చేసిందని వెల్లడించారు. ఎల్నినో వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘ఖేత్ బచావో అభియాన్’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.