
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన (Air India crash) జరిగి నేటికి ఏడాది అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పందించారు
. విమాన ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా నిర్ధరించడానికి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) కృషి చేస్తోందన్నారు. ప్రమాదంపై త్వరలో తుది నివేదిక వస్తుందని.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విమానయాన భద్రతను మరింత మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ సమీక్షలు, సంప్రదింపు ప్రక్రియలు పూర్తయిన తర్వాత విమాన ప్రమాదంపై తుది నివేదిక విడుదల చేస్తామని ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏబీఐ) వెల్లడించింది. ప్రమాదానికి అసలు కారణం తెలుసుకొనేందుకు ఫ్లైట్ రికార్డర్ డేటా, ఇంజిన్ భాగాలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించామని.. అందులో కనుగొన్న విషయాలను నిర్ధరించుకొనేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొంది.
గతేడాది అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన వెంటనే ఎయిరిండియా (Air India) విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాతో బయటపడ్డారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో మృతుల సంఖ్య 260కి చేరింది. బాధిత కుటుంబాలకు టాటాగ్రూప్ నష్ట పరిహారం చెల్లించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: ప్రాణాలతో బతికున్నా కానీ..: ఎయిరిండియా మృత్యుంజయుడి ఆవేదన
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.