
'చార్మింగ్ స్టార్' శర్వా నటిస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ 'భోగి'. దర్శకుడు సంపత్ నందితో శర్వా చేస్తున్న మొదటి సినిమా ఇది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ
చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు
'చార్మింగ్ స్టార్' శర్వా నటిస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ 'భోగి'. దర్శకుడు సంపత్ నందితో శర్వా చేస్తున్న మొదటి సినిమా ఇది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960ల నాటి నేపథ్యంలో సాగే 'భోగి' చిత్రం, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఫిక్షనల్ విలేజ్ లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.
ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేలా, స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ సన్నివేశాన్ని మునుపెన్నడూ చూడని స్టయిల్ లో రూపొందిస్తున్నారు. ఈ కీలకమైన క్లైమాక్స్ లో శర్వా మోస్ట్ ఇంటెన్స్, రిస్కీ స్టంట్ తో తన నటనలో సరికొత్త కోణాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుంది. దీనితో కీలక భాగం షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు డింపుల్ హయతి మరో కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఆగస్టు 28న పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.