శ్రీదేవీ డ్రామా కంపెనీ లో ఇంద్రజ , రష్మీ, హైపర్ ఆది చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రారంభంలో సుధీర్, రాం ప్రసాద్, ఆది త్రయం ఎక్కువగా నవ్వించేవారు. ఇక ఇప్పుడు సుధీర్ ఈ షోకి దూరంగా
ఉంటున్నాడు. ఆది ఈ షోని బాగానే సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. ఈ షోకి ఆది రైటర్‌గానూ వర్క్ చేస్తుంటాడు. ఇక ఈ వచ్చే ఆదివారం నాడు ఫన్ ఇచ్చేందుకు రియల్ కపుల్స్‌తో ఎపిసోడ్ ప్లాన్ చేశారు. రియల్ కపుల్స్‌తో శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం చేయించిన ఫన్, దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా చూపించారు.నటుడు సాయి కిరణ్, అమ్మా రాజశేఖర్, బుల్లితెర నటుడు సిద్దు, రాఘవ, రాం ప్రసాద్ ఇలా అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఇక ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్‌ను రష్మీ సంధించింది. మీరు లేనప్పుడు మీ భార్య మీ ఫోన్ చెక్ చేస్తుందా? అని అడుగుతుంది. మీ భార్య నీ ఫోన్ ఎందుకు చెక్ చేస్తుంది.. అసలు నీ దాంట్లో సీక్రెట్స్ ఏం ఉంటాయి అని రాకెట్ రాఘవని రష్మీ అడుగుతుంది. నాక్కూడా అదే అర్థం కాదు అని రాఘవ అంటాడు. ఇంకో వైపు తన ఫోన్ చెక్ చేస్తుందని అమ్మా రాజశేఖర్ చెబుతాడు. స్టార్టింగ్‌లో మా భార్య చెక్ చేసేది.. అని అమ్మ రాజశేఖర్ అంటాడు. అబద్దాలు చెబితే నమ్మేలా ఉండాలి.. మీ పెళ్లి అయినప్పుడు అసలు ఫోన్స్ ఉన్నాయా? అని అమ్మ రాజశేఖర్ వయసు మీద పరోక్షంగా ఇంద్రజ కామెంట్ చేసింది.ఇప్పుడు చెక్ చేయడం లేదు.. అప్పుడు చేసింది అని అమ్మా రాజశేఖర్ అంటాడు. ఇప్పుడంతా చల్లారిపోయిందని పక్క నుంచి అతని భార్య కౌంటర్ వేస్తుంది. దీంతో అందరూ నవ్వేస్తారు. గురక పెట్టే భర్త అని ప్రశ్న వేయడంతో మృదుల అవును అని చెబుతుంది. ఎలాంటి గురకనో సౌండ్స్ చేసి చెప్పడంతో అంతా నవ్వేస్తారు. అసలు మా ఆయన గురక లేకపోతే నాకు నిద్రే రాదు అని అమ్మ రాజశేఖర్ భార్య చెబుతుంది. మా ఆయన గురక వర్ణనాతీతం అని ఇంకో సింగర్ చెబుతుంది.సీరియల్ నటి విష్ణు ప్రియ మాత్రం భర్త గురక పెట్టడు అని చెప్పింది. ఆంటే విష్ణు ప్రియ పెడుతుందేమో అని ఇంద్రజ కౌంటర్ వేస్తుంది. పక్కనుంచి విష్ణు ప్రియ భర్త సిద్దు అవును.. కరెక్ట్ మేడం అని కౌంటర్లు వేస్తాడు. అలా ఈ ప్రోమో అంతా కపుల్స్‌తో సందడి సందడిగా కనిపిస్తోంది. చూస్తుంటే ఈ ఆదివారం ఫన్ ఓ రేంజ్లో క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది.