సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే మీకు ప్రతికూల ఫలితాలొస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన పవిత్రమైన గంగానదిలో స్నానం చేయాలి లేదా
ప్రవహించే నీటిలోని తీసుకుని మీరు ఇంట్లో స్నానం చేసే బకెట్లో కొంత నీరు వేసుకుని స్నానం చేయాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం సమర్పించాలి. సోమవతి అమావాస్య రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి.
అధిక మాసంలో సోమవతి అమావాస్య రావడం కారణంగా దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ పవిత్రమైన రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల తమ పూర్వీకులు సంతోషిస్తారని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ పవిత్రమైన రోజున మీ శక్తి, సామర్థ్యం మేరకు నల్లనువ్వులు, బియ్యం, గోధుమలు, వస్త్రాలు, పాదరక్షలు, తాగునీటి పాత్రలు వంటివాటిని పేదలకు దానం చేయాలి.
సోమవతి అమావాస్య రోజున ఉదయం లక్ష్మీదేవి చిత్రపటానికి 11 ఆవు నెయ్యి దీపాలు వెలిగించాలి. ‘‘ఓం శ్రీం మహాలక్ష్మై నమః’’మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజా గదిలో 11 పసుపు గవ్వలు ఉంచి లక్ష్మీ స్తోత్రాలను పఠించడం వల్ల వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి.
* సోమవతి అమావాస్య రోజున మాంసం, మద్యం సేవించరాదు. * ఈరోజున ఎలాంటి శుభకార్యాలను చేయరాదు. * ఈ పవిత్రమైన రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. * సోమవతి అమావాస్య రోజున షేవింగ్, కటింగ్ వంటివి చేసుకోకూడదు. * ఇప్పటికే ఏవైనా పనులు జరుగుతుంటే వాటిని ఆపడం వంటివి చేయొద్దు. * అమావాస్య రోజున పసిబిడ్డలను సంధ్యా వేళలో బయటికి తీసుకెళ్లకూడదు. * ఈరోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు. వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు. సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి