బాదం పప్పుల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. బాదం పప్పులు తింటే గాఢ నిద్ర వస్తుంది. గుమ్మడి విత్తనాల్లో ట్రిఫ్టోఫాన్ అనే అమైనో యాసిడ్
ఉంటుంది. దీంతో పాటు మెగ్నీషియం కూడా లభిస్తుంది. గుమ్మడి గింజలు తింటే గాఢ నిద్ర పడుతుంది.
వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్రను క్రమబద్దీకరిస్తాయి. వాల్నట్స్ తింటే గాఢ నిద్ర పడుతుంది.
అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కండరాలను రిలాక్స్ చేస్తాయి. దీంతో గాఢ నిద్ర పడుతుంది.
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, ట్రిఫ్టోఫాన్ అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, నిద్ర నాణ్యతను పెంచుతాయి.
బ్లాక్ బీన్స్‌లో విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. బ్లాక్ బీన్స్ తింటే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నిద్రలో ఆటంకాలు రావు.
గోరు వెచ్చని పాలు తాగడం వల్ల రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది.
చామంతి టీలో ఉండే పోషకాలు నిద్ర నాణ్యతను పెంచుతాయి. చామంతి టీ తాగడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
పుదీనా టీ తాగడం వల్ల బాడీ, మైండ్ రిలాక్స్ అవుతుంది. పుదీనా టీ తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.