
అంతరిక్షంలో ప్రయాణించే గుర్తుతెలియని వింత వస్తువులైన యూఎఫ్వోలపై దశాబ్దాలుగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో విడుదల చేసిన కొన్ని వీడియో ఫుటేజీలు.. గ్రహాంతరవాసులపై
ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీశాయి. అంతరిక్షంలో గుర్తుతెలియని వస్తువు అత్యంత వేగంగా ప్రయాణిస్తూ భౌతిక శాస్త్ర నియమాలకు అందని రీతిలో విన్యాసాలు చేస్తూ కనిపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ప్రియులు, పరిశోధకులు ఈ రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డారు. ఈ వార్త చదివారా: ఆ కాల్స్ నమ్మొద్దు: కెనడాలోని భారత పౌరులకు అడ్వైజరీ