
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Motorola Edge 70 Pro Plus Price in India: ప్రముఖ మోటరోలా కంపెనీ విడుదల చేసే ఎడ్జ్ సిరీస్ మొబైల్స్‌కి అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ చేయడంతో చాలా మంది వినియోగదారులు ఇలాంటి స్మార్ట్‌ఫోన్స్ అతిగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నాయి. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఎడ్జ్ 70 ప్రో ప్లస్‌ను విడుదల చేసింది. ఇది చాలా అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ అద్భతుమైన రియల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ SoC ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. ఈ Motorola Edge 70 Pro+ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.47,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు నుంచి మార్కెట్ విక్రయాల్లోకి అందుబాటులోకి వచ్చింది.. అంతేకాకుండా దీనిపై కంపెనీ అదనంగా రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా అనేక లాంచ్ ఆఫర్లు కూడా అందిస్తూ వస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Motorola అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ కలర్ ఆప్షన్స్‌లో లభించడం విశేషం.. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 2772x1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.8-అంగుళాల సూపర్ HD+ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఈ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇది మోస్ట్ వపర్‌ఫుల్ 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అలాగే 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన 50-మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50x సూపర్ జూమ్ ప్రోతో కూడిన 50-మెగాపిక్సెల్ 3.5x పెరిస్కోప్ కెమెరా కూడా లభిస్తోంది. అదనంగా చాలా ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్‌తో పాటు మాక్రో విజన్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా సెల్పీ కోసం కంపెనీ చాలా ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా కూడా అందిస్తూ వస్తోంది. ఇందులో హై-రెస్ ఆడియో ఆధారిత స్టీరియో స్పీకర్లు కూడా అందుబాటులో ఉండడం విశేషం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.