
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల కేన్ కివీస్ తరఫున 110 టెస్టులు, 175 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ
కెరీర్లో 19వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 48 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. దాదాపు ఎనిమిదేళ్లపాటు (2016-24) న్యూజిలాండ్‌కు సారథ్యం వహించాడు. రెండుసార్లు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు తన జట్టును చేర్చాడు. తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా కివీస్ నిలవడంలో కేన్ కెప్టెన్సీదే కీలక పాత్ర.
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేన్ విలియమన్స్ గతేడాది టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు మిగతా రెండు ఫార్మాట్లకూ గుడ్‌బై చెప్పేశాడు. ‘‘ఆటకు వీడ్కోలు పలకడంపై గత కొన్ని రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్ పట్ల నాకు ఎప్పుడూ బలమైన తపన, ఆసక్తి ఉండేవి. న్యూజిలాండ్ తరపున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నా సర్వశక్తులూ ఒడ్డా. ఆ భావనే నన్ను గర్వపడేలా చేస్తోంది. ఇలాంటి గొప్ప జట్టుకు నాయకత్వం వహించడమూ ఆనందంగా ఉంది. నా మనసులో ఎప్పుడూ టీమ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇన్నేళ్లూ జట్టులో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా’’ అని కేన్ తెలిపాడు.
కేవలం కివీస్ ప్లేయర్‌గానే కాదు.. తెలుగు క్రికెట్ అభిమానులకూ కేన్ విలియమ్సన్ సుపరిచితుడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గతంలో నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో ఎస్ఆర్హెచ్ ఫైనల్‌కూ దూసుకెళ్లింది. 2016లో ఛాంపియన్‌గా అవతరించిన జట్టులోనూ అతడు సభ్యుడే. తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్‌కు ‘కేన్ మామ’గా మారిపోయాడు. ఐపీఎల్లో 79 మ్యాచులు ఆడిన కేన్ 2,128 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ ఆటగాళ్లు సౌమ్యంగానే ఉంటారు. ప్రత్యర్థులను గౌరవించడంలో, క్రీడాస్ఫూర్తిలో ముందుంటారు. ఇక కేన్ విలియమ్సన్ కూడా ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలు పడిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ, కేన్ మంచి స్నేహితులు. వీరిద్దరికీ అండర్ -19 రోజుల నుంచే పరిచయం. ఇప్పటికీ అదే స్నేహంతో ఉండటం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్ సింగర్ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.