
Irfan Pathan: దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్ సాధించాలంటే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అత్యంత కీలకమని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్
అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు జట్టుకు ఇచ్చే స్థిరత్వం, క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని అధిగమించే తీరు మెగా టోర్నీలో భారత్‌కు శ్రీరామరక్ష అవుతుందని ఆయన పేర్కొన్నారు.
read also: ICC World Cup 2027: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ నైపుణ్యాలపై ఇర్ఫాన్ పఠాన్ ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణాఫ్రికాలోని పిచ్‌లు వేగానికి, బౌన్స్‌కు అనుకూలిస్తాయని.. అలాంటి పిచ్‌లపై షార్ట్ పిచ్ బంతులను అలవోకగా ఆడే రోహిత్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై సులభంగా ఆధిపత్యం చెలాయించగలడని చెప్పారు. బంతి లెంగ్త్‌ను ముందే ఊహించి భారీ షాట్లు కొట్టగల రోహిత్ శైలి టీమిండియాకు పెద్ద అస్సెట్ కానుందని విశ్లేషించారు.
వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ సాధించిన నిలకడకు సాటిలేదని పఠాన్ కొనియాడారు. “టాప్ ఆర్డర్లో వికెట్లు త్వరగా పడినా, మూడో స్థానంలో వచ్చే కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగలడు. ముఖ్యంగా భారీ లక్ష్యాలను చేధించడంలో (Chasing) విరాట్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆడుతూ జట్టును గెలిపించే సత్తా అతనికి ఉంది” అని చెప్పారు. ప్రపంచకప్ అందుకోవాలంటే రోహిత్ శర్మ అందించే దూకుడైన ఆరంభం, కోహ్లీ మిడిలార్డర్ నిలకడ భారత్‌కు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
వికెట్ కీపర్ బ్యాటర్ల ఎంపికపై కూడా ఇర్ఫాన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. వన్డే క్రికెట్లో కేఎల్ రాహుల్ భారత్‌కు మొదటి ప్రాధాన్యత కీపర్‌గా ఉండాలని, ఐదు లేదా ఆరో స్థానంలో అతను బ్యాటింగ్‌కు రావడం వల్ల జట్టు సమతుల్యత (Balance) దెబ్బతినకుండా ఉంటుందని చెప్పారు. ఇక బ్యాకప్ కీపర్‌గా ఇషాన్ కిషన్ సరైన ఎంపిక అని, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. వీటితో పాటు, తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అద్భుతంగా రాణిస్తున్న సంజూ శాంసన్ పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తే బాగుంటుందని పఠాన్ సూచించారు.
Hyderabad new flyover: అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
FIFA World Cup 2026: వరల్డ్ కప్ మ్యాచ్ చూడాలని వచ్చి ప్రాణాలు విడిచిన వృద్ధుడు!
ICC World Cup 2027: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 .. తొలిపోరులో మెక్సికోదే గెలుపు
Shreyas Iyer House : వామ్మో.. శ్రేయస్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు
Fifa World Cup: మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం