
సముద్ర వాణిజ్య మార్గాల్లో ఇటీవలి కాలంలో పెరుగుతున్న దాడుల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు
తీసుకుంటున్నామని, ప్రతి నావికుడికి అండగా ఉంటామని స్పష్టం చేసింది. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణించే నావికులకు, నౌకా కంపెనీలకు కీలక సూచనలు జారీ చేసింది.ఇటీవల ఒమన్లోని సోహార్కు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' అనే నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. పలావు జెండాతో ఉన్న ఈ ట్యాంకర్లో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది భారతీయులే ఉన్నారు. ఈ ఘటనతో వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ప్రమాదాలు మరోసారి స్పష్టమయ్యాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కీలక ప్రకటన చేశారు. ప్రతి భారతీయ నావికుడి భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.నావికుల భద్రత కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత నౌకాదళం, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, మిత్రదేశాల సముద్రయాన యంత్రాంగాలు, షిప్పింగ్ కంపెనీలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని ఆయన వివరించారు. బాధిత నావికులకు, వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలోని సీఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ (ఎస్డబ్ల్యూఎఫ్ఎస్) సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం, ఇలాంటి సంఘటనల్లో మరణించిన నావికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎస్డబ్ల్యూఎఫ్ఎస్