
రెండు నెలల్లోనే 25 శాతం పెరిగిన అమ్మకాలు పెట్రోల్ ధరల పెంపుతో ప్రజల మొగ్గు ఉమ్మడి జిల్లాలో 10వేలకు పైగా ఈ-బైస్కిళ్లు హనుమకొండ: పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నగరవాసులు ఈ-సైకిళ్లపై దృష్టి
సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ-సైకిళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రెండు నెలల్లోనే అమ్మకాలు 25 శాతం పెరిగాయి. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు సాధారణ సైకిళ్లు అమ్మే వ్యాపారు లు ఈ-బైస్కిల్స్ విక్రయాలపై దృష్టి సారిస్తున్నారు. బైకులు కొనాలనుకునే వారంతా ఈ-సైకిళ్ల కోసం ఆరా తీస్త్తున్నారు. కార్లు ఉన్నవారు సైతం ఎలక్ట్రిల్ సైకిళ్లను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా ఈ-సైకిళ్ల జోరే కనిపిస్తోంది. పెట్రోల్‌ధరలు ఆకాశన్నంటుతుండడం తో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ-సైకిల్‌పై దృష్టి సారిస్తున్నారు. దీనితో వీటి కొనుగో ళ్లు జోరందుకుంటున్నాయి. ఉమ్మడివరంగల్ జిల్లాలో ప్రస్తు తం 10వేలకు పైగా ఈ-బైస్కిళ్లు తిరుగుతున్నాయి. కొత్త మోడల్స్ నగరంలో ట్రాఫిక్ సమస్య అధికమవడంతో దగ్గరి ప్రయాణాలకు ఈ-సైకిళ్లను ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జి చేస్తే 40 నుంచి 100 కి.మీ. వరకు ప్రయాణిం చే సామర్థ్యంతో కొత్త మోడల్స్‌తో ఈ-బైస్కిల్స్ మార్కెట్లోకి వచ్చాయి. లిథియం, ఆయాన్ బ్యాటరీలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితీరు కనబరుస్తాయి. పలు మోడళ్లు ఈమోరాడ్, లీడర్ ఈ-పవర్ ఎల్6 ఎలక్ట్రిక్ సైకిల్, లీడర్ ఈ-పవర్ ఎల్7 ఎలక్ట్రిక్ సైకిల్, హీరో లెక్ర్టో సీ6 ఎలక్ర్టిక్ సైకి ల్, ఈమోరాడ్ ఈఎంఎక్స్ ప్లస్, హార్న్‌బ్యాక్ ఎక్స్‌వన్ ఎలక్ట్రిల్ సైకిల్ తదితర మోడళ్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీనితోపాటు ప్రిమియమ్ సెగ్మెంట్లో మెర్సిడో బెంజ్, బీఎండబ్ల్యులు కూడా ఈ-సైకిళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రధాన మంత్రి మోదీ ఇటీవల చేసిన సూచనలతో ఎలక్ర్టిక్ సైకిళ్ల డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. ఆఫ్‌లైన్‌లోనే ఒక్క స్టోర్‌లో నెలకు 50 నుంచి 70 ఎలక్ట్రిక్ సైకిళ్లను అమ్ముతున్నామంటున్నారు. ఆన్లైన్లో ఈ-సైకిళ్ల అమ్మకాలు ఇంకాఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వీటి ధరలు పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి అందుబాటులోనే ఉన్నాయి. అందుబాటు ధరల్లో.. సంప్రదాయిక పెట్రోల్ బైక్‌ల కన్నా వీటి ధరలు చాలా తక్కువ. బ్యాటరీ రేంజ్‌ను బట్టి రూ.25వేల నుంచి రూ.60 వేల వరకు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎమటోరాడ్ కంపెనీకి చెం దిన ఎక్స్ 1, 2, 3, అయోకి కంపెనీకి సంబంధించిన టి రెక్స్, ఫ్లెక్సిగో, స్ట్రీట్ మాంబో స్ట్రీట్ గోస్ట్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్స్ 1, 2, 3 ఈ-బైస్కిల్ రూ.28వేలకు, ఎంఎస్ ధోని రూ.30వేలకు లభిస్తుండగా, స్ట్రీట్ మాంబో, స్ట్రీట్ గోస్ట్ రూ.65వేలకు లభిస్తోంది. నగరంలోనే తిరిగేవాళ్లు రూ.25వేల నుంచి రూ. 30వేల లోపు ధర ఉన్న ఈ-సైకిళ్లను ఎక్కు వగా కొంటున్నారు. యువకులు రూ.60వేలు ఆపైన ధర ఉన్నవాటిని ఇష్టపడుతున్నారు. బ్యాటరీ సైకిళ్లను విద్యార్థులు, వ్యాపారులు, యువతులు, మధ్య వయస్కులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. 4 గంటలపాటు చార్జి పెడితే 40 నుంచి 45 కి.మీ. ప్రయాణించవచ్చు. బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ ఉన్న బైస్కిల్స్పై 100 నుంచి 120 కి.మీ వరకు వెళ్లవచ్చు. పలు ప్రయోజనాలు వివిధ బ్రాండ్లు మార్కెట్లోకి అధునాతన ఫీచర్లు, గేర్ సిస్టమ్స్, ఎక్కువ బ్యాటరీ సామర్ధ్యం గల మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ-సైకిళ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకు ఓపిక ఉన్నంత దూరం తొక్కుకుంటూ వెళ్లవచ్చు. ఓపిక లేనప్పుడు చార్జింగ్‌ను ఉపయోగించుకొని బైక్ మాదిరిగా ప్రయాణం చేయవచ్చు. ఇంధన ధరలు ఇలాగే పెరుగుకుంటూ వెళితే ఈ-సైకిళ్ల అమ్మకాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వార్తలు కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి నకిలీ ట్రేడింగ్ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా Read Latest AP News And Telangana News And International News And Telugu News