
వృషభ రాశి వారికి వ్యతిపాత యోగం ఎన్నో అనుకూల ప్రభావాలను తీసుకొస్తుంది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వీరికి ఆర్ధికంగా మంచి లాభాలు చేకూరుతాయి. పనిలో వారి కష్టానికి తగ్గ గుర్తింపు దక్కుతుంది
. చేసిన పనులన్నీ సానుకూల ఫలితాలను అందిస్తాయి. వీరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వారి గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
వ్యతిపాత యోగం వల్ల సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. వీరికి ఇతరుల నుంచి రావాల్సిన డబ్బుల చేతికి అందుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి మెరుగుపడుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల త్వరగా కోలుకుంటారు. కుటుంబంలో బంధాలు బలపడతాయి. పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.
వ్యతిపాత యోగం తులారాశి మంచి ఆదాయ మార్గాలను పెంచుతుంది. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. వీరి ఆర్థిక శ్రేయస్సు విపరీతంగా మెరుగుపడుతుంది. వీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి వారికి ఈ యోగం ఎంతో సానుకూలంగా ఉంటుంది. నూతన శక్తి అందుతుంది. వీరికి ఆర్థికంగా మంచి స్థిరత్వం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. లేదా జీతాలు పెరగవచ్చు. వ్యాపారం విస్తరించాలనుకునే వారికి మంచి అవకాశం లభిస్తాయి. వీరిలో నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. వీరు ఏదైనా యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పాత గొడవలు పోతాయి.