
మలయాళంలో దృశ్యం 3 నేరుగా విడుదలవగా, ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇది ఆశించిన స్థాయిలో స్పందనను పొందలేదు. ముఖ్యంగా తెలుగులో దృశ్యం మొదటి రెండు భాగాలకు వెంకటేష్
నటన, క్రేజ్ ఎంతగానో కలిసొచ్చింది. కానీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో వెంకటేష్ దృశ్యం 3లో నటించలేకపోయారు. దీనితో మలయాళ వెర్షన్‌నే తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులు వెంకటేష్ స్థానంలో మోహన్‌లాల్‌ను అంతగా అంగీకరించలేకపోయారు. దీని ప్రభావం కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది, తెలుగులో దృశ్యం 3 ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.ఈ పరిణామాల నేపథ్యంలో, దృశ్యం 3 హిందీ వెర్షన్ భవిష్యత్తుపై పలు సందేహాలు తలెత్తాయి. ఇప్పటికే దక్షిణాదిలో క్లైమాక్స్ సస్పెన్స్ బయటపడటంతో, హిందీలో రీమేక్ చేయడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్న చర్చ జరిగింది. ఈ విషయమై దృశ్యం సిరీస్ దర్శకుడు జీతూ జోసెఫ్ కీలక వివరణ ఇచ్చారు. హిందీ వెర్షన్ డబ్బింగ్ కాదని, రీమేక్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు