
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ విద్యాసంస్థలు కలకలలాడనున్నాయి. నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి అడుగుపెట్టబోతున్నారు. విద్యా సంవత్సరం
మొదటి రోజే విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు 98 శాతానికి పైగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, డిక్షనరీలు ఇప్పటికే పాఠశాలలకు చేరవేశారు. బడి తెరిచిన రోజే వీటిని విద్యార్థుల చేతుల్లో పెట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీపై అంతర్జాతీయ పరిణామాలు కొంత ప్రభావం చూపాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా మెటీరియల్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ఈ ఏడాది కిట్ల పంపిణీ కొద్దిగా ఆలస్యం కానుంది. అయితే, గుత్తేదారులు ఇప్పటికే సరఫరా చేసిన బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్టులు, యూనిఫాంలను ఏ రోజుకారోజు విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల (పేరెంట్స్-టీచర్స్) సమావేశం నాటికి వంద శాతం కిట్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మళ్లీ సెలవులు, స్కూల్స్ రీఓపెనింగ్ కొత్త డేట్ ఇదే!ఫీజుల జులం.. మధ్యతరగతి గుండెల్లో గుబులు!ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు సంస్కరణలతో సిద్ధమవుతుంటే.. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అప్పుడే ఫీజుల దోపిడీకి తెరలేపాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట, రీ-అడ్మిషన్ల నెపంతో తల్లిదండ్రుల జేబు‌లకు చిల్లులు పెడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు సైతం తమ స్కూళ్లలోనే కొనాలంటూ యాజమాన్యాలు హుకుం జారీ చేయడం పతాక స్థాయికి చేరింది. దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదేఏటా ఇష్టారాజ్యంగా పెంచుతున్న ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు, రవాణా చార్జీల భారం భరించలేక.. సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఈ ఫీజుల జులంపై విద్యాశాఖ పర్యవేక్షణ, నియంత్రణ కేవలం కాగితాలకే పరిమితమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాసుల వేటలో పడి విద్యా ప్రమాణాలను గాలికొదిలేస్తున్న ఈ కార్పొరేట్ గద్దల దోపిడీకి అడ్డుకట్ట వేసే గట్టి చర్యలు ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుందా అని విద్యార్థుల తల్లిదండ్రులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు.