
రష్యా నుంచి చమురు కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫిన్లాండ్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 నుంచి రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు
చేస్తోందని, అప్పట్లో అమెరికానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయాలని సూచించిందని అన్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేసి.. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు తోడ్పడాలని అమెరికా కోరిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పిందే అమెరికా: జైశంకర్ |