
Today Astrology June 12 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు , ఉత్తరాయణ కాలం. 2026 జూన్ 12వ తేదీ శుక్రవారం నాడు ప్రదోష వ్రతం వస్తోంది. పండితుల
అభిప్రాయం ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవి? ఏ రాశి వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి? దీని గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఈ రోజు మీకు శుభంగా ఉండబోతోంది. మానసిక స్థితి బాగుంటుంది.. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు.. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవడం శ్రేయస్కరం. కొత్త పనులు మొదలుపెట్టకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవాలి.. ఇతరులతో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం అవసరం.
ఈ రోజు మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయించుకోండి. ఉద్యోగ రీత్యా ప్రశంసలు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆరోగ్య విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి.
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నవారికి శుభ సందేశాలు అందుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏదైనా ప్రతికూల ఆలోచనల నుండి బయటపడే అవకాశం ఉంది.
ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. మాట తీరుపై నియంత్రణ ఉండాలి.. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అకస్మాత్తుగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)