తెలంగాణలో మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ మొత్తానికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యారు. దేవ్‌జీ 1980-82లో జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్(ఎంపీసీ) చదివారు
. ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్ వైపు ఆకర్షితులై అందులో చేరారు. ఆయన ఇంటర్ సెకండియర్‌లో అన్ని పరీక్షలు రాసినా.. తెలుగు సబ్జెక్ట్ ఒక్కటి రాయలేకపోయారు. మిగతా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు.. తెలుగు మాత్రం అలాగే ఉండిపోయింది. దేవ్‌జీ ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయారు.. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేయాలని భావించారు. తెలంగాణ ఇంటర్ బోర్డు దేవ్‌జీకి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చింది. ఆయన తెలుగు పరీక్ష రాయగా.. గురువారం విడుదలైన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేవ్‌జీకి తెలుగులో 72 మార్కులు వచ్చాయి. ఆయన మొత్తం 614 మార్కులతో ఇంటర్ పాసయ్యారు. అంతేకాదు దేవ్‌జీ లా చేయాలనుకున్నారు. ఐదేళ్ల కోర్సు చదివేందుకు ఇటీవల లాసెట్ రాయగా.. దేవ్‌జీకి 349వ ర్యాంకు వచ్చింది. ఆయన ఇంటర్లో తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో లా చదవడానికి లైన్ క్లియర్ అయ్యింది. మావోయిస్టు అగ్ర కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన సాధారణ సభ్యుడిగా ఉద్యమంలో చేరి పార్టీ దళపతిగా ఎదిగారు. దేవ్‌జీది జగిత్యాల జిల్లా కోరుట్ల కాగా.. ఇంటర్ సెకండియర్లోనే పీపుల్స్‌వార్‌లో చేరారు. గడ్చిరోలిలో దళ సభ్యుడిగా, ఆ తర్వాత ఏరియా, డివిజినల్ కమాండర్‌గా పనిచేశారు. 2001లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు ఇంఛార్జ్‌గా పనిచేశారు. అంతేకాదు సీఆర్బీ (సెంట్రల్ రీజినల్ బ్యూరో)ను గైడ్ చేశారు. పొలిట్ బ్యూరోలో సభ్యుడిగానూ కొనసాగారు. అంతేకాదు 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరి దగ్గర జరిగిన దాడి ఘటనలో దేవ్‌జీ కీలకంగా వ్యవహరించారు. 2010లో దంతెవాడలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటనలోతిరుపతి కీలకంగా పనిచేశారు. దేవ్‌జీ ఎన్ఐఏకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌తోపాటు రూ.కోటి వరకు రివార్డు ఉంది.