
34 ఏళ్ల తర్వాత రాసినా తెలుగులో 72 మార్కులు కోరుట్ల, న్యూస్టుడే: మావోయిస్టుల మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ(61) ఇంటర్లో ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి
1980-82లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్(ఎంపీసీ) చదివారు. అప్పట్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడై... అందులో చేరారు. ఈ క్రమంలో ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా... మిగతా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్జీ... ఇంటర్ పూర్తి చేయాలని భావించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి బోర్డు నుంచి అనుమతి పొందారు. తాజాగా విడుదలైన ఫలితాలలో ఆయన తెలుగులో 72 మార్కులు సాధించారు. మొత్తం 614 మార్కులతో ఇంటర్ ఉతీర్ణులయ్యారు. ఐదేళ్ల న్యాయవిద్య చదవడం కోసం ఇటీవల లాసెట్ రాసిన దేవ్జీకి 349వ ర్యాంకు వచ్చింది. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించడంతో న్యాయవిద్యలో ప్రవేశానికి మార్గం సుగమమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.