మేషరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త పనులు చేసేందుకు చాలా ఉత్సాహంతో ఉంటారు. మీ
జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగంలో చేరిక గురించి శుభవార్తలు వినిపించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి.
వృషభ రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. స్నేహితుల సాయంతో మీ పనులన్నీ పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. బయటి ఆహారం తీసుకోవడం మానుకోవాలి. శుభయోగాల ప్రభావం వల్ల పెద్దల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణం చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. పెట్టుబడులు పెరగడం వల్ల మీ సంతోషం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక లేదా మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావొచ్చు. మీరు దానధర్మాలు చేసే అవకాశం కూడా ఉంది. దుర్గాదేవికి తేనేతో కూడిన తమలపాకులను సమర్పించాలి.
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శుక్రుడు, గురుడు కలయిక కారణంగా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది.
సింహ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించొచ్చు. ఈరోజు మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి. మరోవైపు వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు స్నేహితులనుంచి మద్దతు లభిస్తుంది. మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు.
తులా రాశి వారు ఈరోజు కొత్త ప్రణాళికల కోసం పని చేయొచ్చు. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయం గడిపే అవకాశాలున్నాయి. మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడొచ్చు. ఈరోజు మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన పాత వివాదాలన్నీ పరిష్కరించబడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీరు కొత్త స్నేహితులను కలుసుకోవచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. ఈరోజు ఊహించని ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినపిస్తాయి.
మకర రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో చంద్రుడు, సప్తమ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి.
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీ సోదరులతో ఏదైనా ఉద్రిక్తత లేదా వివాదం తలెత్తితే సంయమనం పాటించాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకవోడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.
మీన రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో చాలా బిజీగా గడుపుతారు. స్నేహితుల సాయంతో మీ పనులన్నీ సులభంగా పూర్తి చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి