
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా పిలవబడే సూర్యుడు జూన్ 16 నుండి జూలై 16 వరకు మిథున రాశిలో సంచరించనున్నారు. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు అధికారానికి, ప్రభుత్వ ఉద్యోగాలకు, కీర్తి ప్రతిష్టలకు
, పురోగతికి మరియు పితృత్వానికి కారకుడు. రవి గోచార ప్రభావం వల్ల రాబోయే నెల రోజుల కాలంలో కొన్ని రాశుల వారికి ఏ చిన్న ప్రయత్నం చేసినా తిరుగులేని విజయం లభిస్తుంది. మేష రాశిమేష రాశి వారికి పంచమాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల అద్భుతమైన విజయాలు వరిస్తాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం ఖాయం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, ఊహించని శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి, విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రభుత్వ రంగం నుండి తగిన గుర్తింపు లభిస్తుంది.వృషభ రాశివృషభ రాశి వారికి చతుర్ధాధిపతి అయిన రవి ధన స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల పిత్రార్జితం లేదా వారసత్వపు ఆస్తి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్టు వివాదాలు తొలగిపోయి విలువైన ఆస్తి మీ వశమవుతుంది. సొంత ఇల్లు కొనాలనే కల నెరవేరుతుంది, వాహన యోగం కూడా ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆఫీసులో పదోన్నతితో పాటు ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.సింహ రాశిరాశ్యాధిపతి అయిన సూర్యుడు లాభ స్థానంలోకి రావడం వల్ల సింహ రాశి వారికి ఈ కాలంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక వృద్ధి ప్రయత్నాలు వంద శాతం విజయవంతం అవుతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాల వారికి ఊహించని లాభాలు వస్తాయి. తండ్రి వైపు నుండి ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో భారీ జీతంతో కూడిన ప్రమోషన్ దక్కుతుంది. ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు.కన్యా రాశికన్యా రాశి వారికి దశమ స్థానంలో రవి సంచరించడం వల్ల దిగ్బల రాజయోగం పడుతుంది. దీనివల్ల కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం లేదా మంచి ప్యాకేజీతో వేరే కంపెనీలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నచ్చిన రంగంలో ఉద్యోగం లభిస్తుంది. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ఆర్థిక సమస్యలు సమసిపోతాయి.తులా రాశితులా రాశి వారికి లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మరియు ఉద్యోగులకు విదేశాల నుండి అద్భుతమైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుండి ఆస్తి కలిసి వస్తుంది. మీ మనసులోని కోరికలు నెరవేరి, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.జూన్ 17న అరుదైన ధనయోగం.. 4 రాశులవారికి లక్ష్మీ కటాక్షం!ధనుస్సు రాశిధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. భారీ జీతంతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో లేదా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో సంబంధం కుదురుతుంది. విదేశీ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, ఆరోగ్యం చాలా బాగుంటుంది. గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.