
చిన్న, పెద్ద కిచెన్లు రెండింటికీ ఈ వాల్ మౌంటెడ్ స్టీల్ ర్యాక్ చాలా బాగుంటుంది. దీన్ని గోడకు అమర్చడం వల్ల, కౌంటర్‌టాప్‌పై ఎక్కువ స్థలం మిగులుతుంది. మల్టీ-టియర్ డిజైన్ ర్యాక్‌లో చాలా లెవల్స్ ఉంటాయి
. వేర్వేరు షెల్ఫ్‌లలో గిన్నెలు, జాడీలు, ఇతర వంట సామాన్లు పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు వస్తువులు వెంటనే దొరుకుతాయి.
వంటగదిలోని మూలలను సరిగ్గా వాడుకోవడానికి కార్నర్ స్టీల్ ర్యాక్ మంచి ఎంపిక. ఇది ఖాళీ స్థలాన్ని ఉపయోగపడేలా మార్చి స్టోరేజ్‌ను పెంచుతుంది. కిచెన్ కి మోడ్రన్ లుక్ ఇస్తుంది.
పుల్-అవుట్ స్టీల్ ర్యాక్‌ను క్యాబిన్ లోపల అమరుస్తారు. అవసరమైనప్పుడు దీన్ని బయటకు లాగవచ్చు. దీనివల్ల స్టోరేజ్‌ను మరింత సమర్థంగా వాడుకోవచ్చు.
ఓపెన్ షెల్ఫ్ డిజైన్ కిచెన్‌కు మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో అందమైన పింగాణీ సామాన్లు, మసాలా డబ్బాలు, అలంకరణ వస్తువులను పెట్టవచ్చు.
హ్యాంగింగ్ స్టీల్ ర్యాక్‌ను సీలింగ్‌కు లేదా గోడ కింద భాగంలో అమర్చవచ్చు. దీనికి ప్యాన్లు, ఇతర టూల్స్‌ను వేలాడదీయవచ్చు. దీనివల్ల కిచెన్ ప్రొఫెషనల్‌గా, ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది.
స్లిమ్ డిజైన్ స్టీల్ ర్యాక్‌లు ఇరుకైన ప్రదేశాలకు చాలా అనువుగా ఉంటాయి. కిచెన్ కి మోడ్రన్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Cotton Kurti: స్టైలిష్ లుక్ కోసం అదిరిపోయే డిజైన్ లో కాటన్ కుర్తీలు
Mangalsutra Designs: మగువలు మెచ్చిన మంగళసూత్రం డిజైన్స్
Mirror work Sarees: అదిరిపోయే అద్దాల చీరలు...ఎంత బాగున్నాయో
Mirror Blouse: మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేస్తే అందరి చూపు మీమీదే