
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక కాంగ్రెస్‌కు ఊహించని రాజకీయ షాక్ Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా
ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు ఆమె నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు వెల్లడించలేదనే కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదని అధికారి వెల్లడించారు. అయితే తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, నామినేషన్ తిరస్కరణ అన్యాయమని మీనాక్షి నటరాజన్ వాదించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన లభించలేదు. Delimitation: దేశ రాజకీయాల్లో భారీ మార్పులు.. లోక్‌సభ సీట్ల పెంపు దిశగా కేంద్రం అడుగులు.. దక్షిణాది రాష్ట్రాలకు కూడా దీంతో న్యాయపరమైన పోరాటానికి సిద్ధమైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది. పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో బీజేపీ తరఫున బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు గట్టి రాజకీయ ఎదురుదెబ్బగా మారగా, పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.