
Vangalapudi Anitha: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్
విషయంలో జగన్ వ్యవహరించిన తీరును ఆమె ఎండగట్టారు. అసలు జగన్‌కు “విశాఖ స్టీల్ ప్లాంట్” అనే పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని హోంమంత్రి స్పష్టం చేశారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాల కోసం వాడుకోవాలని జగన్ కుట్రలు చేశారని, ఈ విషయాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారే స్వయంగా బయటపెట్టారని అనిత గుర్తుచేశారు. “స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కార్మికులు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తుంటే.. జగన్ కనీసం ఒక్కరోజు కూడా ధర్నా చౌక్‌కు వెళ్లి వారికి సంఘీభావం తెలపలేదు. అప్పట్లో కార్మికులను ఎయిర్‌పోర్టుకు పిలిపించుకుని మాట్లాడిన జగన్, ఇప్పుడు కూడా వారిని తన వద్దకే రప్పించుకుని రాజకీయం చూస్తున్నారు” అని మండిపడ్డారు.
Read also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ఒకప్పుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో 99 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తోందని అనిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చెబుతూ ఆమె కొన్ని కీలక పరిణామాలను ప్రస్తావించారు:
స్టీల్ ప్లాంట్ ప్రమాదాల్లో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తొలిసారిగా ‘శాశ్వత ఉద్యోగం’ ఇచ్చేలా కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.60 లక్షల నుండి రూ.1 కోటి వరకు బీమా ప్రయోజనాలు అందుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా కేంద్ర ఉక్కు మంత్రిని విశాఖకు తీసుకురాలేకపోయారని, కానీ ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్‌లోనే తెల్లవారుజాము వరకు ఉండి స్వయంగా సమీక్షలు నిర్వహించారని గుర్తుచేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంపై స్పందిస్తూ.. ఆ సంస్థ రూ.150 కోట్ల బీమా చెల్లించాల్సి ఉండగా, జగన్ సర్కార్ కేవలం రూ.12 కోట్లతోనే సెటిల్ చేసి చేతులు దులుపుకుందని అనిత ఆరోపించారు. దీనికి తోడు, గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి దక్కాల్సిన 10.24 శాతం వాటాను కూడా గత వైసీపీ ప్రభుత్వమే వదులుకుందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తమ కూటమి ప్రభుత్వమేనని, ప్లాంట్ రక్షణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వంగలపూడి అనిత తేల్చిచెప్పారు.
iPhone 18 : సెప్టెంబర్‌లో iPhone 18 విడుదల.. ఫీచర్స్ ఇవేనా ?
AI Data Center : రిలయన్స్ తో టై-అప్.. దేశంలో మెటా తొలి ఏఐ డేటా సెంటర్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Pawan Kalyan First Name : పవన్ కళ్యాణ్ కు ఆ పేరు ఎలా పెట్టారో తెలుసా ?
Vizag Steel Plant Accident : జగన్ తీరు ఇంకా మారలేదు.. శవ రాజకీయాలు వదల్లేదు – TDP
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
CBN : ప్రభుత్వ సేవల కోసం ఆన్లైన్లో మరో యాప్ – చంద్రబాబు
Nandamuri Balakrishna Birthday: బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్
Kancherla Srinivasulu murder case: కంచర్ల శ్రీనివాసులు హత్య కేసులో 13 మందికి యావజ్జీవ జైలు శిక్ష