
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Samsung Galaxy A27 Price Leaked Ahead of Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్‌లో మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. సాంసంగ్ గెలాక్సీ A27 పేరుతో మార్కెట్లోకి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా విడుదల కావడానికి ముందే దీనికి సంబంధించిన కీలక వివరాలతో పాటు కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ గ్యాడ్జెట్స్ వెబ్సైట్ కథనాల ప్రకారం.. ఈ ఫోన్ ధరతో పాటు డిజైన్, కెమెరా వివరాలు, ప్రాసెసర్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి.. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైన ధరల వివరాలు.. సాంసంగ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని అత్యంత రీజనబుల్ ధరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం సాంసంగ్ గెలాక్సీ ఏ 27 భారత మార్కెట్లో సుమారు రూ.22 వేల నుంచి రూ.25 వేల బడ్జెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది విభిన్న స్టోరేజ్ వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులను కలిగి ఉంటుందని తెలుస్తోంది..
ఇటీవల సోషల్ మీడియాలో లీకైన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ ప్లస్ (FHD+) అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్కు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా మల్టీటాస్కింగ్, వేగవంతమైన పనితీరు కోసం సాంసంగ్ ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ ఎక్సీనోస్ (Exynos) లేదా మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ 5G ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. అలాగే ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ (OIS సపోర్ట్‌తో) ఉండే అవకాశం ఉందని లీకైన వివరాలు చెబుతున్నాయి.. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా ఇందులో 5,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కూడా అందిస్తున్నారు. ఇది 25W వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి.
అధికారికంగా లాంచ్ డేట్ అప్పుడే.. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో సామ్సంగ్ సొంత One UI యూజర్ ఇంటర్ఫేస్తో అందుబాటులోకి రాబోతోంది. సెక్యూరిటీ పరంగా ఇండిపెండెంట్ సెన్సార్‌తో పాటు చాలా ప్రత్యేకమైన నాక్స్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే అధికారికంగా samsung galaxy a27 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అద్భుతమైన కెమెరాతో పాటు డిస్ప్లే కలిగిన బడ్జెట్ ఫోన్ కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ గా భావించవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.