
ఇంటర్నెట్‌డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే మమతకు
నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్‌రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అస్సాం కాంగ్రెస్ సీనియర్ నేత సంతోష్ మోహన్‌దేవ్ కుమార్తె సుష్మితా దేవ్ (Sushmita Dev). గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. 2019లో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడి.. 2021లో టీఎంసీ (TMC)లో చేరారు. టీఎంసీలో అతికొద్దికాలంలోనే ఉన్నత పదవులు అందుకున్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పొందారు. బుధవారం తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌కు ఆమె లేఖ రాశారు. తక్షణమే దీన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా ప్రకటించిన వెంటనే కీలక పరిణామం చోటుచేసుకుంది. సుష్మిత దిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ను కలిశారు. దీంతో ఆమె భాజపాలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.