
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Union minister kishan reddy fires on cm revanth reddy over Telangana project row: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్‌గా అనేక ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాగునీటి ప్రాజెక్టులు, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు మొదలైన పనుల్లో కేంద్రం నుంచి నిధులు రాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నాడంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా రేవంత్ ను తాము తల్చుకుంటే తెలంగాణ పొలిమేరల్లో తిరగకుండా చేస్తామంటూ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి ఒక లడాయి కోతి అంటూ ఏకీపారేశారు.
దమ్ముంటే, చిత్తశుద్ది ఉంటే మహా రాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ తీసుకొని రావాలని ప్రజల కోసం కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లడానికైన సిద్దమన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వరుస ఘాటు విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి మాస్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.
తెలంగాణ రాజకీయాల్ని అవినీతి, అక్రమాలు, దోపిడిల పాలు చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి రేవంత్ ప్రభుత్వం విధానాలే కారణమన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎవరికి వారు ఎక్కడ దోచుకొవాలన్నదే ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయన్నారు. సీఎం రేవంత్ నిర్ణయాల వల్ల తెలంగాణ అప్పల రాజ్యంగా మారిందన్నారు. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ భూముల్ని ఇష్టారితీన అమ్మివేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదని ఆందోళనలు వ్యక్తం చేశారు.
అంతే కాకుండా.. తాను రేవంత్ రెడ్డిలా నేను మాటకారిని కాదు.. మాట మీద నిలబడే వ్యక్తిని అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం పార్టీలు మారే నైజం నాది కాదని, మీరు ఇచ్చిన హామీలపై అమరవీరుల స్థూపం దగ్గరైనా, ప్రెస్ క్లబ్ లోనైనా చర్చకు నేను రెడీ.. మీరు సిద్ధమేనా?.. దమ్ముంటే చర్చకు వస్తావా..అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆయన చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. తాను ఏ శాఖ అభివృద్ధిని అడ్డుకున్నానో సీనియర్ జర్నలిస్టుల ముందు రేవంత్ రెడ్డి నిరూపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవావ్ విసిరారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల దయాదాక్షిణ్యాల వల్లేమీ కాదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నేను అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీకి వెళ్లానని, రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని మండిపడ్డారు.
Read more: CM Revanth Reddy: మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు బృహత్తర కార్యక్రమంకు శ్రీకారం.!.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, మెట్రో ఫేజ్-2 పై సీఎం చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి అపాయింట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పటికైన అసత్య ప్రచారాలు మానుకొవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చురకలు పెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.