
స్టాండప్ కామెడీ షోలో సరదాగా చేసిన ఓ వ్యాఖ్య ఓ యువకుడి ఉద్యోగానికే ఎసరు పెట్టింది. రూ.370 బిర్యానీ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అతను పనిచేస్తున్న గురుగ్రామ్ కంపెనీ
అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే, హిమాన్షు జంగ్రా (22) అనే యువకుడు గురుగ్రామ్‌లోని 'స్టార్విక్ డిజైన్' అనే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతను కమెడియన్ ప్రణీత్ మోర్ స్టాండప్ కామెడీ షోకు ప్రేక్షకుడిగా వెళ్లాడు. షోలో భాగంగా ఆ కమెడియన్‌తో హిమాన్షు మాట్లాడుతూ, తాను ఒక అమ్మాయితో డేట్‌కు వెళ్లానని, ఆమెతో కలిసి రూ.370 పెట్టి చికెన్ బిర్యానీ తిన్నానని చెప్పాడు. ఆ తర్వాత, పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవాలి కదా ("వసూల్ తో కరుంగా") అనే అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్య మహిళల పట్ల అగౌరవంగా, అంగీకారాన్ని చులకన చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిమాన్షుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివాదం ముదరడంతో హిమాన్షు క్షమాపణలు చెప్పి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నాడు.ఈ ఘటనపై స్పందించిన స్టార్విక్ డిజైన్ సంస్థ వ్యవస్థాపకుడు వివేక్ విశ్వకర్మ, హిమాన్షు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి తమ సంస్థ విలువలకి విరుద్ధమని తెలిపారు. ఆఫీసులో అతని ప్రవర్తనపై ఎటువంటి ఫిర్యాదులు లేనప్పటికీ, ఈ వ్యాఖ్యల ప్రభావం దృష్ట్యా అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. షో సమయంలోనే