సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైన చిత్రాలతో కోట్లాది మంది హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు . బాలనటుడిగా మెప్పించిన మహేష్ బాబును పూర్తిస్థాయి
హీరోగా పరిచయం చేస్తూ 1998లో “రాజకుమారుడు” చిత్రం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రముఖ పద్మాలయ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఆ ముహూర్తపు వేడుక తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. ఆనాటి అరుదైన రికార్డులను, నేటి కాలంతో ముడిపడి ఉన్న సంఘటనలను పరిశీలిస్తే ఎవరికైనా గూస్బంప్స్ రావడం ఖాయం.* ‘పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ సీఎం హోదాలో చంద్రబాబు క్లాప్ సినిమా రంగానికి, నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ అల్లుడిగా, సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే చంద్రబాబు.. 1998లో ‘రాజకుమారుడు’ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహేష్ బాబు కెరీర్‌లోని అత్యంత కీలకమైన ఆ తొలి షాట్‌కు నాటి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా క్లాప్ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఒక కాబోయే టాలీవుడ్ సూపర్‌స్టార్ సినిమాను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి క్లాప్ కొట్టి ప్రారంభించడం ఒక సంచలనమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోయింది.* బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఊచకోత.. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి మెగా ఎంట్రీతమ రంగాల్లో ఇద్దరూ సూపర్స్టార్లేసరిగ్గా 28 ఏళ్ల వెనక్కి తిరిగి చూసుకుంటే కాలం ఎన్నో మలుపులు తిరిగింది కానీ ఆ ఇద్దరి స్థానాలు మాత్రం అజేయంగా నిలిచాయి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైవైజంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మాణంలో ప్రీతి జింటా హీరోయిన్గా, మణిశర్మ సంగీతంతో వచ్చిన ‘రాజకుమారుడు’ (1999) బాక్సాఫీస్‌ను షేక్ చేసి మహేష్ బాబుకు ‘ప్రిన్స్’ అనే బిరుదుతో పాటు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆనాడు మొదలైన మహేష్ ప్రస్థానం.. నేడు ఆయన్ని టాలీవుడ్లోనే అత్యంత ప్రభావవంతమైన, వసూళ్ల సునామీ సృష్టించే నంబర్ వన్ సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది. అటు రాజకీయ రంగంలోనూ సరిగ్గా అదే క్రేజ్ రిపీట్ అయింది. 1998లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ఆటంకాలను దాటుకుని, అఖండ ప్రజాదరణతో ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుగు రాజకీయాల్లో ఇలాంటి అరుదైన రికార్డు మరెవరికీ లేకపోవడం గమనార్హం. నాడు పద్మాలయ స్టూడియోలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మహేష్ బాబు సినీ ప్రయాణం మొదలుకాగా.. కాలం ఈ 28 ఏళ్లలో ఆ ఇద్దరినీ తమ తమ రంగాల్లో తిరుగులేని సూపర్స్టార్లుగా మార్చింది. ఒకరు బాక్సాఫీస్ సుల్తాన్‌గా, మరొకరు అసంఖ్యాక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నేటికీ జన హృదయాలను ఏలుతుండటం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.