
టార్గెట్లు, కంపెనీ పాలసీల పేరుతో ఉద్యోగులను యంత్రాల్లా చూసే నేటి కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వాన్ని చాటిన ఒక బాస్ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో కోట్ల మంది హృదయాలను తాకుతోంది. వ్యాపారవేత్త అంకిత్ పాండే
‘ఎక్స్’ వేదికగా పంచుకున్న ఈ రియల్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంకిత్ పాండే కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్న ఒక అకౌంటెంట్.. తన కొడుకు ప్రాణాంతక వ్యాధితో మంచం పట్టి.. మృత్యువుకు చేరువలో ఉన్నాడని, అతడి చివరి రోజుల్లో తోడుగా ఉండేందుకు ఉద్యోగానికి తాను రాజీనామా చేస్తున్నానని కన్నీళ్లతో లేఖ అందించాడు. బాబుకు 24 గంటలూ సపర్యలు చేయాల్సి రావడంతో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కూడా చేయలేనని ఆవేదన చెందాడు. అది విన్న అంకిత్ పాండే ఆ రాజీనామా లేఖను పక్కనపెట్టి.. “నువ్వు వెంటనే వెళ్లి నీ కొడుకు పక్కన ఉండు. నీ సీటు ఎవరూ తీసుకోరు. నీకు ప్రతి నెలా జీతం కచ్చితంగా అందుతుంది. డబ్బు గురించి ఆలోచించకు” అని భరోసానిచ్చారు. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది. నెల రోజుల తర్వాత ఆ కొడుకు ఊహించని విధంగా కోలుకున్నాడు. ఆనందంతో ఆఫీసుకు వచ్చిన ఉద్యోగి.. తాను పనిచేయని ఆ నెల జీతాన్ని కట్ చేసుకోవాలని బాస్‌ను కోరాడు., అంకిత్ నవ్వుతూ తిరస్కరించారు. “ఆ జీతం నీ శ్రమకు కాదు.. నీ కొడుకు కోలుకోవాలని మా కంపెనీ ఇచ్చిన చిన్న కానుక” అని చెప్పారు. కంపెనీ అంటే కేవలం పని స్థలం కాదు, ఒక కుటుంబం అని నిరూపించిన అంకిత్ పాండేపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్ ఇదే!
మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా…!
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
Jagapathi Babu: పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది