
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. నిజంగానే పచ్చిఉల్లితో బోలెడు ప్రయోజనాలు. షుగర్ పేషెంట్లకు ఇదొక వరం. డయాబెటిస్ కంట్రోల్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలోని చక్కెర
స్థాయిలు 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
రోజూ తినే ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఉల్లిపాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు మీ డైట్లో చేర్చుకోండి. ఉల్లిపాయలను ఎక్కువగా తినడం మంచిది.
ఉల్లిపాయలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించే ప్రక్రియలకు సపోర్ట్ ఇస్తాయి.
ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, హెచ్‌డీఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Masala Chai : వానాకాలంలో ఇలా స్పెషల్ మసాలా చాయ్ చేసి తాగితే ఉంటుందీ...
Moringa Benefits: ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండవు