
Today Astrology 09 June Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరా భవనామ సంవత్సరం, జేష్ట మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం ప్రకారం 2026 జూన్ 9, మంగళవారం. పండితుల అంచనా ప్రకారం ఈరోజు ఏయే రాశులు కొత్త
పనులకు దూరంగా ఉండాలి? వ్యాపారంలో ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి? అనే పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.
మేష రాశి: ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు అందుతాయి, అనుకోకుండా ధన లాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది, అన్ని పనులు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మిత్రులతో సరదాగా గడుపుతారు.
వృషభ రాశి: ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా వ్యాపార లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఆర్థిక నష్టం కలగవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఇతరులతో వాదోపవాదాలకు వెళ్లకుండా, కొత్త పనులు మొదలుపెట్టకుండా ఉండటం మంచిది.
కర్కాటక రాశి: ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం, సఖ్యత నెలకొంటాయి. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు చేసే ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండటం అవసరం. అతి ఆశతో నిర్ణయాలు తీసుకోవద్దు. కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి.. కొత్త పనులు ప్రారంభించకపోవడమే ఉత్తమం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. పెద్దల సలహాలు పాటించడం మంచిది.
కుంభ రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. గొడవలకు దూరంగా ఉండటం. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోపాన్ని తగ్గించుకోండి, లేదంటే నష్టపోయే అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)