బంగాళాదుంపలు, బీన్స్, క్యారెట్లు, బఠానీలు, కాలీఫ్లవర్, ఇలా మీకు నచ్చిన కూరగాయలను తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటాలు, కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి. కూరగాయలను చిన్నగా కట్
చేసుకోండి. కట్ చేసిన కూరగాయలను కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి.
మరోవైపు కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి, గసగసాలు వేసి పేస్ట్ తయారు చేసుకోండి. ఇది కుర్మాకు మంచి రుచిని ఇస్తుంది.
ఒక పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేయండి.
ఇప్పుడు టమాటా ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలపండి.
ముందుగా ఉడికించుకున్న కూరగాయలను వేసి మసాలాలతో కలిపి కాసేపు వేయించండి. ఉప్పుని వేసి సరి చూసుకోండి.
ఉడుకుతున్న కూరలో ముందుగా తయారు చేసిన కొబ్బరి పేస్ట్‌ను వేయండి. దీంతో కుర్మా టేస్టీగా మారుతుంది.
చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కుర్మా రెడీ అవుతుంది.