
రోజూ పెట్టుకోవడానికి మినీ హార్ట్ హూప్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. వీటిని 9 క్యారెట్ల బంగారం, వెండి లేదా గోల్డ్ ప్లేటెడ్ డిజైన్లలో కొనుగోలు చేయవచ్చు. మీకు కాస్త హెవీగా, గ్లామరస్‌గా కనిపించడం ఇష్టమైతే
స్టోన్ వర్క్ హార్ట్ హూప్ ఇయర్ రింగ్స్ ట్రై చేయవచ్చు. వీటిలో హార్ట్ షేప్ లోపల స్టోన్ డిటైలింగ్ ఉంటుంది.
డబుల్ హార్ట్ డిజైన్ ఉన్న హూప్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ చెవిపోగులు రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్‌ను ఇస్తాయి. పార్టీలు, ఆఫీస్ ఫంక్షన్లకు ఇవి మంచి ఎంపిక.
చిన్న చిన్న పింక్ హార్ట్లతో ఉన్న హూప్ ఇయర్ రింగ్స్‌ను కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. గోల్డ్ బేస్‌పై పింక్ కలర్ డిటైలింగ్ వీటికి చాలా క్యూట్ అండ్ మోడ్రన్ లుక్ ఇస్తుంది.
రౌండ్ హూప్‌కు వేలాడుతున్నట్లుగా ఉండే హార్ట్ డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. బరువు తక్కువగా ఉంటాయి.
గోల్డ్, సిల్వర్ మాత్రమే కాదు, ఇప్పుడు పింక్, రెడ్, నియాన్ షేడ్స్‌లో కూడా హార్ట్ హూప్ ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ మీకు క్యూట్ అండ్ ట్రెండీ లుక్ ఇస్తాయి.
Gold Nose Pin: తక్కువ వెయిట్ లో వచ్చే బంగారు ముక్కుపుడకలు.. చూడండి
Healthy Drinks: విటమిన్ D కోసం కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
Gold Mangalsutra: డైలీవేర్ కి స్టైలిష్ మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో
Silver Vaddanam: వెండి వడ్డాణాలు ఇవిగో.. ఇప్పుడివే లేటెస్ట్ ట్రెండ్