
హైదరాబాద్ మహానగరంలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సాగుతున్న పబ్ సంస్కృతిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిధిలోని ఓ ప్రముఖ పబ్లో
హైదరాబాద్ మహానగరంలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సాగుతున్న పబ్ సంస్కృతిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిధిలోని ఓ ప్రముఖ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను పట్టుకోవడానికి సైబరాబాద్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్ స్వయంగా రంగంలోకి దిగారు.కస్టమర్ వేషధారణలో పబ్ కి వెళ్ళిన డీసీపీ రితిరాజ్ కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు యువతులతో అశ్లీలనృత్యాలు చేయిస్తున్నట్లు డీసీపీ రితిరాజ్‌కు రహస్య సమాచారం అందింది. దీనిపై కేవలం కిందిస్థాయి సిబ్బందిని నమ్ముకోకుండా, ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించాలని ఆమె నిర్ణయించారు. ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ కస్టమర్ వేషధారణలో వెళ్లిన ఆమె, అక్కడ జరుగుతున్న నిర్వాకాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం నగరంలో తీవ్రసంచలనం సృష్టించింది.అశ్లీల నృత్యాలు, లోపల గలీజ్ దందా చూసి షాక్.. పోలీసులతో మెరుపు దాడి పబ్‌లోకి ప్రవేశించిన డీసీపీ, అక్కడ యువతులతో చేయిస్తున్న అశ్లీల డాన్సులు, కస్టమర్లను లోబరుచుకుని, వసూలు చేస్తున్న భారీవసూళ్లను నిశితంగా గమనించారు. సమాచారం పూర్తిగా నిజమని నిర్ధారించుకున్న వెంటనే, ఆమె ముందే సిద్ధంగా ఉంచిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిమిషాల వ్యవధిలో పబ్‌పై మెరుపుదాడి చేసిన పోలీసులు.. పబ్ మేనేజర్, క్యాషియర్ తో పాటు మహిళా డ్యాన్సర్లను సరఫరా చేస్తున్న ఏజెంట్ శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసాంఘిక కార్యాకలాపాలు పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ పబ్ యాజమాన్యం కేవలం మద్యం విక్రయాలకే పరిమితం కాకుండా, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ దాడిలో డ్యాన్స్ చేస్తున్న ముగ్గురు యువతులను పోలీసులు సురక్షితంగా రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు.హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు పొంచి ఉన్న అతి పెద్ద విపత్తు!పబ్ లైసెన్స్ రద్దుకు లేఖ పబ్‌లో పట్టుబడిన నగదుతో పాటు సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేశారు. అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా పబ్ నడపడం, అశ్లీల నృత్యాలకు వేదికగా మార్చడంతో సదరు పబ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖకు డీసీపీ రితిరాజ్ లేఖ రాశారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.