
డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికా రిజిస్ట్రేషన్‌తో ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 (Gulfstream G200) ప్రైవేట్ జెట్ విమానం.. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా
ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ క్రాష్ అయింది. రన్‌వేపై వేగంగా దూసుకెళ్లిన విమానం ఒక్కసారిగా పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రైవేట్ జెట్ డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా నుంచి అమెరికాలోని టెక్సాస్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, ఎయిర్‌పోర్ట్‌కు నైరుతి దిశలో 16 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం తిరిగి లా రొమానా ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి అనుమతి కోరారు. రన్‌వే 29పై ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలిపోయిందివిచారణ ప్రారంభించిన అధికారులుప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించినట్లు డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇనిస్టిట్యూట్ (IDAC) నిర్ధారించింది. ఈ ఫ్లైట్‌లో ఎలాంటి ప్రయాణికులు లేరని, ఇది కేవలం పొజిషనింగ్ (Ferry Flight) ఫ్లైట్ మాత్రమేనని అధికారులు తెలిపారు. విమానం వేగంగా దూసుకుపోతూ పేలిపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి.ప్రమాదానికి గురైన గల్ఫ్‌స్ట్రీమ్ G200 విమానాన్ని 2004లో తయారు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం