
ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్‌వేపై ఘోరంగా తడబడింది. క్షణాల్లోనే ప్రైవేట్ జెట్ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం
Jun 8 2026 8:59 AM | Updated on Jun 8 2026 9:03 AM
ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్‌వేపై ఘోరంగా తడబడింది. క్షణాల్లోనే ప్రైవేట్ జెట్ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలిపించింది. పైలట్ చేసిన ప్రయత్నం చివరకు విషాదాంతంగా మారింది. ఆ మంటల్లో చిక్కుకుని పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్‌వేపై సురక్షితంగా దిగకముందే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలం అగ్నిగుండంలా మారిపోయింది.
అధికారుల వివరాల ప్రకారం, విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక లోపమా? ఇంజిన్ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. దీంతో రన్‌వేకు చేరకముందే విమానం నేలపై కూలిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీ మంటలు ఎగసిపడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో విమానం శకలాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.
ఈ ఘటనపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక పరిస్థితి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో జరిగిన సంభాషణలు, ఫ్లైట్ డేటా తదితర అంశాలను పరిశీలించనున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్